పటాన్‌చెరు, అమీన్ పూర్ లలోని ఆఫీసుల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.మూడు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలోని Navya Real estate కార్యాలయాలపై బుధవారం నాడు Income tax అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు.

Sanga Reddy జిల్లాలోని నవ్య రియల్ ఏస్టేట్ కు చెందిన పటాన్‌చెరు, అమీన్ పూర్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రి, అనంతపురం, కర్నూల్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో కూడా ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

2021 మార్చి మాసంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు రియల్ ఏస్టేట్ సంస్థలపై ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 14 రియల్ ఏస్టేట్ కంపెనీలపై అధికారులు సోదాలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రియల్ ఏస్టేట్ సంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. రియల్ ఏస్టేట్ వ్యాపారులు ట్యాక్స్ ఎగ్గొట్టారనే సమాచారం కారణంగా ఐటీ అధికారులు అప్పట్లో సోదాలు నిర్వహించారు.