కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరికి ఐటీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆదాయపన్ను శాఖ టీడీఎస్ విభాగం అధికారులు.. సోదాలు చేపట్టారు. రేణుకా చౌదరి భర్త  శ్రీధర్ చౌదరికి చెందిన కంపెనీలో అధికారులు దాడులు చేపట్టారు.

శ్రీధర్ చౌదరికి చెందిన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల జీతాల నుంచి ట్యాక్స్ కట్ చేస్తున్నారని..కానీ ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి మాత్రం చెల్లించడం లేదని.. ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తమకు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు.