హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కళామందిర్ సంస్థకు సంబంధించిన ప్రాంగణాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా సమాచారం.

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి సంస్థకు సంబంధించి వస్త్ర షోరూమ్‌ల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తంగా 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కళామందిర్ సంస్థ చైర్మన్‌, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. 

ఈరోజు ఉదయం నుంచే ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు విజయవాడ, వైజాగ్‌లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.