బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

బీఆర్ఎస్ ఎంపీ  కొత్త  ప్రభాకర్ రెడ్డి నివాసంలో బుధవారంనాడు  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 Income Tax Officials Raid On  BRS MP Kotha Prabhakar Reddy Residence  In Hyderabad lns


హైదరాబాద్: బీఆర్ఎస్ ఎంపీ  కొత్త ప్రభాకర్ రెడ్డి  నివాసంలో  బుధవారం నాడు  ఉదయం నుండి  ఐటీ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు.  ఇవాళ  ఉదయం నుండి   బీఆర్ఎస్ కు  చెందిన  బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి  నివాసంలో కూడ  ఐటీ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

హైద్రాబాద్ లోని  ఎంపీ  కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో  ఐటీ  అధికారులు  సోదాలు  చేస్తున్నారు.  కొత్త ప్రభాకర్ రెడ్డి  నివాసం ముందు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి  నివాసంతో పాటు  కార్యాలయాల్లో కూడ  ఐటీ అధికాులు  సోదాలు  చేస్తున్నారు. 

హైద్రాబాద్ కేంద్రంగా  ఐటీ సోదాలు  గత కొంతకాలంగా  సాగుతున్నాయి.   రియల్ ఏస్టేట్ సంస్థలు,  ఫార్మా కంపెనీలు,  పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల  ఇళ్లలో  సోదాలు  నిర్వహిస్తున్నారు.  ఆదాయ పన్ను శాఖకు  రిటర్న్స్ లో  పేర్కొన్న  అంశాలపై అనుమానాలతో  చాలా సంస్థల్లో  ఐటీ శాఖాధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు.

కేంద్రంలోని  బీజేపీ  కి వ్యతిరేకంగా  కేసీఆర్  సర్కార్  దూకుడుగా విమర్శలు  చేస్తుంది.  అయితే  బీఆర్ఎస్ కు  చెందిన  ప్రజా ప్రతినిధులపై  ఐటీ, ఈడీ  దాడులు  జరిగే అవకాశం ఉందని  కేసీఆర్  ఆ పార్టీ నేతలకు  సూచించారు.  ఈ దాడులను  చట్టపరంగా  ఎదుర్కొందామని కేసీఆర్ పార్టీ నేతలకు  చెప్పారు.  ఇదిలా  ఉంటే   గత కొంతకాలంగా  బీఆర్ఎస్ కు చెందిన  ప్రజా ప్రతినిధులపై  ఐటీ,  ఈడీ   సోదాలు నిర్వహించింది.

 సాధారణ తనిఖీల్లో భాగంగానే  ఈ సోదాలు  నిర్వహించినట్టుగా  దర్యాప్తు  సంస్థలు ప్రకటించాయి.  తెలంగాణ మంత్రి  గంగుల కమలాకర్,  బీఆర్ఎస్ ఎంపీ  రవిచంద్ర  నివాసాలు,  కార్యాలయాల్లో  ఈడీ  సోదాలు  నిర్వహించిన  విషయం తెలిసిందే . ఇవాళ  బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే , ఎంపీ  నివాసాల్లో  ఐటీ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు.ఈడీ,  ఐటీ  అధికారుల సోదాలకు  సంబంధించి  తమకు సంబంధం లేదని  బీజేపీ  నేతలు  చెబుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios