కేసీనో  వ్యాపారి  చీకోటి ప్రవీణ్  కు  ఐటీశాఖాధికారులు  నోటీసులు జారీ చేశారు.  బినామీ పేరుతో  చీకోటి ప్రవీణ్ కుమార్  కారు  రిజిస్ట్రేషన్  జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. 

హైదరాబాద్: కేసినో వ్యాపారం నిర్వహించే చీకోటి ప్రవీణ్ కుమార్ కు ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. బినామీ పేరుతో కారును రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఐటీ శాఖాధికారులు గుర్తించారు. బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని చీకోటి ప్రవీణ్ కుమార్ కు ఐటీ శాఖాధికారులు నోటీసులిచ్చారు.

రూ. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ విషయంలో ఐటీ శాఖాధికారులు నోటీసులిచ్చారు. ఈ కారును బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా ఐటీ శాఖాధికారులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై ఐటీ శాఖాధికారులు నోటీసులిచ్చారు. బినామీ పేరుతో కారును రిజిస్ట్ట్రేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని ఆ నోటీసులో ఐటీశాఖాధికారులు కోరారు. 

అయితే ఈ కారు తనది కాదని చీకోటి ప్రవీణ్ ఐటీ శాఖాధికారులకు సమాధానమిచ్చినట్టుగా సమాచారం. ఈ కారు తన స్నేహితుడిదిగా ప్రవీణ్ కుమార్ ఐటీ శాఖాధికారులకు ఇచ్చిన సమాధానంలో తేల్చి చెప్పారు.2021 డిసెంబర్ మాసంలో ఈ కారు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కారు విషయమై ఆ నోటీసులో ఐటీ శాఖ ప్రశ్నించింది. బినామీ యాక్ట్ కింద ఈ కారును ఎందుకు సీజ్ చేయకూడదని ప్రశ్నించింది.

ఈ నెల 22వ తేదీన తన ఇంటి ఆవరణలో పార్క్ చేసిన కారును గుర్తు తెలియని దుండగులు అపహరించారని చీకోటి ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.

చీకోటి ప్రవీణ్ కుమార్ కేసీనో వ్యాపారం విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కేసీనో విషయంలో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.ఈ విషయమై ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు.