Asianet News TeluguAsianet News Telugu

పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష రేపే.. 'నిమిషం నిబంధన' యథాతదం.. ఆల‌స్య‌మైతే అంతే..

తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగష్టు 28వ తేదీ ఆదివారం జరగనున్నది. ఈ ప‌రీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు సిద్ధమయ్యాయి.
 

Important Instructions to Candidates for TS Police Exam
Author
First Published Aug 27, 2022, 4:44 AM IST

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగష్టు 28వ తేదీ ఆదివారం జరగనున్నది. ఈ ప‌రీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈ రాత పరీక్ష జరగనుంది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే..  ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు స్పష్టం చేసింది.  

ఈ క్ర‌మంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆయా నగరాల్లో పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద క్షుణంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోని రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా త‌గిన ప్రణాళికలను అమ‌లు చేయ‌నున్నారు. ప‌రీక్ష కేంద్రాల స‌మీపంలో క‌ఠిన నియ‌మాలు అమలులో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. 

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:

>> అభ్య‌ర్థులు  www.tslprb.in వెబ్ సైట్ కు వెళ్లి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ లను ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు)

>> డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై నిర్దేశిత స్థలంలో ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోను  అతికించుకోవాలి. 

>> ఆప్లై స‌మ‌యంలో అప్ లోడ్ చేసిన ఫోటో కాకుండా వేరే ఫోటో అతికించినా లేదా హాల్‌టికెట్‌ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు.

నిమిషం నిబంధ‌న ఉంది కాబ‌ట్టి ఒక్క నిమిషం  ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.

>> అభ్యర్థులు త‌మ వెంట‌ హాల్ టికెట్ తో పాటు బ్ల్యూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే  తెచ్చుకోవాలి.
 
>> అభ్యర్థులు త‌మ వెంట సెల్ ఫోన్స్,  చేతి గడియారం, క్యాలిక్యులేటర్ వంటి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, ఖాళీ పేపర్లను ప‌రీక్ష కేంద్రాలోకి తీసుక‌వెళ్ల‌డానికి అనుమతించారు. 

>> అభ్య‌ర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. హ్యాండ్ బ్యాగ్, పౌచ్‌లు లాంటివి కూడా తీసుకెళ్ల‌రాదు.  పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.

 >> ప‌రీక్ష స‌మయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు కావున‌ అభ్యర్థులు చేతివేళ్ళకు మెహంది, టాటూలు లేకుండా చూసుకోవడం మంచిది. 
 
>> ఓఎంఆర్ షీట్స్ ఎలాంటి రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాయ‌కూడ‌దు. అలా చేస్తే..  మాల్ ప్రాక్టీస్ గా పరిగణిస్తారు.

>> పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలను గుర్తించాలి. 

>> ప్ర‌శ్నాప‌త్రం ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలు ఉంటే..  ఇంగ్లీష్ వర్షన్‌నే పరిగణలోకి తీసుకోవాలి.

>> నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్‌టికెట్లను భద్రపరచుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios