అత్యాధునిక డిజైన్లలో టవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు నమూనాలను చూస్తే తెలుస్తుంది.
హైదరాబాద్ లో నిర్మించనున్న ఇమేజ్ టవర్స్ నమూనా చిత్రాలను ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న నాస్ కామ్ గేమ్ డెవలపర్ల సదస్సును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ పై నమూనాలను విడుదల చేసారు. అత్యాధునిక డిజైన్లలో టవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు నమూనాలను చూస్తే తెలుస్తుంది. ఇన్నోవేషన్ మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని కెటిఆర్ ట్విట్టర్ లో వివరించారు. ఏ భవనంలో ఏమేమి ఉంటాయో విడుదల చేసిన భవనాల నమూనా చిత్రాల్లోనే చూచాయగా మంత్రి వివరించారు.
