హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది.

టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై అలంద మీడియా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు రవిప్రకాష్‌పై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌లపై రవిప్రకాష్ ఇప్పటికే  హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.తనపై నమోదైన కేసుల విషయమై గత మాసంలో  ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.