Asianet News TeluguAsianet News Telugu

పెండింగ్ బిల్లులు కట్టండి.. ఫైన్ పడకుండా కేటీఆర్‌తో నేను మాట్లాడతా: హరీశ్ విజ్ఞప్తి

ప్రతి గృహిణి విద్యార్థిని స్వచ్ఛ్ బడికి తీసుకుపోవాలని చెత్తపై వారికి అవగాహన కల్పించాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్, మున్సిపల్ ట్యాక్స్ ఒకేసారి చెల్లిస్తే ఫైన్ పడకుండా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడతానని ఆయన తెలిపారు.

if needed will speak to minister ktr says harish rao in siddipet ksp
Author
Siddipet, First Published Jul 16, 2021, 4:45 PM IST

సిద్ధిపేటను చెత్త రహితంగా, హరితహారంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు . సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం చెత్త, హరితహారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ..  పట్టణంలోని ప్రతి వీధిలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. డ్రైనేజీలలో వర్షం నీరు తప్ప మురికి నీరు కనిపించకూడదని సూచించారు.

ప్రతి వీధిలో చెత్త సేకరణ సక్రమంగా జరగాలని హరీశ్ అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ సక్రమంగా జరగకపోతే ఆ వీధి మున్సిపల్ జవాన్ ను సస్పెండ్ చేయాలని చెప్పారు. ప్రతి మున్సిల్ ఉద్యోగి, వార్డ్ కౌన్సిలర్, ప్రతి వ్యక్తి చెత్త, చెట్లపై శ్రద్ధ చూపించాలని మంత్రి సూచించారు. ప్రతి గృహిణి విద్యార్థిని స్వచ్ఛ్ బడికి తీసుకుపోవాలని చెత్తపై వారికి అవగాహన కల్పించాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్, మున్సిపల్ ట్యాక్స్ ఒకేసారి చెల్లిస్తే ఫైన్ పడకుండా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడతానని ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios