బీఎస్పీ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ తెలిపారు. స్కూల్ పిల్లలకు నాలుగో భాషగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలనే నిర్ణయం వచ్చింది.

హైదరాబాద్: బీఎస్పీ అధికారంలోకి వస్తే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన బహుజన విద్యార్థి భరోసా సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో బీఎస్పీ విద్యార్థి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో పలు హామీలు ఉన్నాయి.

వచ్చే సెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ఆర్ఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి విద్యార్థికి యేటా రూ. 7,500 అందిస్తామని చెప్పారు.

Also Read: భర్తను నల్లవాడని పిలవడం క్రూరత్వమే: దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

తమ పార్టీ అధికారంలోకి వస్తే పూలే విద్యార్థి భరోసా పేరుతో కాలేజీ విద్యార్థులకు అన్ని ప్రభుత్వరంగ వాహనాల్లో ప్రయాణంలో 50 శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలం నుంచి 100 మంది చొప్పున విదేశీ విద్య అందిస్తామని అన్నారు. ఆ వంద మందిలో 50 మంది విద్యార్థినులు తప్పక ఉంటారని తెలిపారు. మరో సంచలన హామీ కూడా ఇచ్చారు. కేజీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు కోడింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తామని అన్నారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు 4వ భాషగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించే కార్యక్రమం చేపడతామని ఆర్ఎస్పీ తెలిపారు. రాష్ట్రంలోని 10 లక్షల మందికి ఉన్నత విద్య కల్పిస్తామని చెప్పారు.