Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో జికా వైరస్ ఉనికి.. ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

దేశంలో జికా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తిచెందుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జికా వైరస్‌ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఎంఆర్, పుణేలోని ఎన్‌ఐవీ నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలను వెల్లడించింది.

ICMR Study found the presence of Zika virus in Telangana
Author
First Published Jul 6, 2022, 12:07 PM IST

దేశంలో జికా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తిచెందుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జికా వైరస్‌ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీఎంఆర్, పుణేలోని ఎన్‌ఐవీ నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది.  ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడింది.  భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని అధ్యయనం పర్కొంది.  వైరస్ వ్యాప్తిపై నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. 

ఈ అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలాయి. అందులో తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన నమునా కూడా ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు జికా వైరస్ నిశ్శబ్దం వ్యాప్తి చెందుతోందని అధ్యయనం తెలిపింది. ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్,  ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ BR Shamanna స్పందిస్తూ.. శాస్త్రవేత్తలు జీకావైరస్‌ను గుర్తించడంపై  దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. ఇంతకుముందు జీకా వైరస్ అంటే ఏంటో  పెద్దగా తెలియదని.. ఇప్పుడు అవగాహన పెరుగుతోందని చెప్పారు.

ఇక, వర్షాకాలంలో డెంగ్యూ, chikungunya వంటి దోమల కాటు ద్వారా సంక్రమించే వ్యాధుల పెరుగుదలతో.. జికా కేసులు పెరిగే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. 2017 నుంచి 20121 వరకు జికా వైరస్ దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కనుగొనబడింది. ఇక, గతంలో గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే జికా వైరస్ వ్యాప్తి చెందింది. ప్రతి సంవత్సరం గతంలో వ్యాప్తి చెందని కొత్త రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios