ఇబ్రహీంపట్నం రియాల్టర్ల హత్య కేసులో ఐదుగురు పోలీసుల మీద వేటు తప్పదని తెలుస్తోంది. ప్రధాన సూత్రధారి మట్టారెడ్డి వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ఆ ఐదుగురు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహించడం వల్లే హత్యలకు దారితీశాయని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం : సంచలనం రేపిన A couple of realtors murderedల కేసులో కొంతమంది పోలీసులపై తప్పదని తెలుస్తోంది. రెండు నెలలుగాLake Villaలోని భూతగాదాల్లో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మట్టారెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ తగాదాలు అనేకమార్లు మాట్లాడినప్పటికీ సయోధ్య కుదరలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఇద్దరు మట్టారెడ్డిని బెదిరించినట్లు సమాచారం. అదే రోజు తనకు ప్రాణహాని ఉందని వారిద్దరిపై Mattareddy ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని తెలిసింది. ఉన్నతస్థాయి అధికారి నోటీసుకు ఫిర్యాదు వెళ్ళిన స్పందన లేదని.. దీంతో భయాందోళనకు గురైన మట్టారెడ్డి... ఎలాగైనా వారిద్దరి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ఇలా murderకు కుట్ర చేసినట్లు సమాచారం.
భారీగా ముడుపులు…
పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి నుంచి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఓ పెద్ద స్థాయి పోలీసు అధికారి లేక్ విల్లాను పరిశీలించి వెళ్ళారని సమాచారం. కేసును కనీసం పట్టించుకోలేదని మట్టారెడ్డి ఆరోపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీస్ కమీషనర్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై వేటు వేయాలని రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఫిర్యాదు చేసిన స్పందన లేకే…
రెండు నెలలుగా కర్ణంగూడాలో భూవివాదాలు చోటు చేసుకుంటున్నాయని లేక్ విల్లా ఆర్చిడ్స్ ఓనర్స్ అసోసియేషన్ వారు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కౌన్సిలర్ లపై కేసు నమోదు చేసి మట్టారెడ్డి కేసుపై ఎలా ఎటూ తేల్చలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే తన ప్రాణాలు కాపాడుకోవడానికి హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. మట్టారెడ్డి ఫిర్యాదు చేసినప్పుడే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే హత్యల దాకా వచ్చేది కాదని చర్చించుకుంటున్నారు
ఐదుగురు నిందితులకు రిమాండ్..
జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మేరెడ్డి మట్టారెడ్డి, ఖాజా మొయినుద్దీన్, బుర్రి బిక్షపతి, సయ్యద్ ఇబ్రహీం, సమీర్ అలీని సాయంత్రం ఇబ్రహీంపట్నం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.
శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి పదెకరాల స్థలం కొన్నాడు. అయితే ఆ స్థలం తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశాడు. దీంతో మంగళవారం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి కలిసి స్థలం వద్దకు వెళ్లగా మట్టారెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే మట్టారెడ్డి అనుచరులతో కలిసి వారిద్దరిపై కాల్పులకు దిగాడు.
ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. మట్టారెడ్డి, ఖాజా మహముద్దీన్, భూరి భిక్షపతి, సయ్యద్ రెహ్మాన్ సమీర్ అలీ, రాజుఖాన్‌లను అరెస్ట్ చేశారు. అలాగే రెండు వెపన్స్, 20 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ కాల్పుల ఘటనలో ఇద్దరు చనిపోయారని ఆయన తెలిపారు. లేక్ విల్లా ఆర్కిడ్స్ వెంచర్ వ్యవహారమే హత్యకు కారణంగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం 14 ఎకరాల భూ వివాదం హత్యకు దారి తీసిందని సీపీ చెప్పారు. ప్రధాన నిందితుడు మట్టారెడ్డి అని మహేశ్ భగవత్ తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు బీహార్‌కు చెందినవాళ్లేనని కమీషనర్ పేర్కొన్నారు.
