సీఎంఓలోకి రాహుల్ బొజ్జా: హుజూరాబాద్‌లో కేసీఆర్
ఎస్సీ వేల్పేర్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను తన కార్యాలయంలో సెక్రటరీగా నియమిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. సోమవారం నాడు హుజూరాబాద్ లో దళితబంథు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు.
హైదరాబాద్: రాహుల్ బొజ్జా ను సీఎంఓలో సెక్రటరీగా నియమిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
సోమవారం నాడు హుజూరాబాద్ మండలం శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా కష్టపడి పనిచేస్తాడని ఆయన చెప్పారు. తానే ఈ జిల్లాకు కలెక్టర్ ను ఈ జిల్లాకు కలెక్టర్ గా నియమించానని ఆయన చెప్పారు.
ఎస్సీ వేల్పేర్ శాఖ సెక్రటరీగా రాహుల్ బొజ్జా పనిచేస్తున్నాడని ఆయన ఈ సభలో ప్రస్తావించారు. ఉద్యమకారులకు న్యాయసహాయం చేసిన బొజ్జా తారకం కొడుకే రాహుల్ బొజ్జా అని ఆయన సభలో గుర్తు చేశారు.
రాహుల్ బొజ్జా తన కార్యాలయంలో పనిచేస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ సభకు వచ్చే ముందు తాను ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లు కలిసి వస్తున్న సమయంలోనే ఈ విషయమై చర్చించుకొన్నామన్నారు.
రాహుల్‌ను సీఎంఓలో సెక్రటరీగా నియమిస్తున్నామన్నారు. రేపటి నుండి రాహుల్ బొజ్జా తన కార్యాలయంలో పనిచేస్తూ దళితుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు.
సీఎంఓలో ఒక్క దళిత అధికారి ఉన్నాడా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్ ను ప్రశ్నించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రదీప్ చంద్రకు ఎందుకు పదవీ కాలాన్ని పొడిగించలేదని ఆయన ప్రశ్నించారు. దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.