అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని శిక్షణ ఐఏఎస్ లు శుక్రవారం కలిశారు. తెలంగాణ కేడర్ కి చెందిన శిక్షణ ఐఏఎస్ లు తమ ట్రైనింగ్ లో భాగంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను పరిశీలించారు. అనంతరం స్పీకర్ పోచారంని కలిశారు. ఈ సందర్భంగా శిక్షణ ఐఏఎస్ లకు పోచారం  శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా స్వామ్య ప్రభుత్వాలకు రెండు కళ్లు లాంటివారని ఆయన పేర్కొన్నారు.