పోలీసులపై ఐఏఎస్ వెంకటేశ్వరావు ఆరోపణలు
ఐఏఎస్ వెంకటేశ్వరరావు డ్రైవర్ నాగరాజు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు సీసీ టీవీ దృశ్యాలు విచారణ అనంతరం ఈ హత్యలో వెంకటేశ్వరరావు, అతడి కుమారుడు సుక్రుకు ప్రమేయం ఉందని తేల్చిన విషయం తెలిసిందే.
పోలీసుల ఎదుట కూడా హత్యకు తాను సహకరించినట్లు నిన్న వెంకటేశ్వరరావు అంగీకరించాడు. అయితే ఈ రోజు ఆయన మాట మార్చాడు. ఆనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తన కొడుకు సుక్రును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. నాగరాజు హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే తన కొడుకు మాత్రం తప్పుచేశాడని ఒప్పుకున్నారు.
అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతోనే పోలీసులు ఈ కేసులో నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
తనను విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపించారు.
