తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ బదిలీ.. రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలికెరిపై వేటు
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వున్న భారతి హోలికెరిపై బదిలీ వేటు వేయడంతో పాటు ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

- ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాష్
- సివిల్ సప్లయ్ కమీషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్
- ఎక్సైజ్ కమీషనర్‌గా ఈ . శ్రీధర్
- ఇంటర్ విద్య డైరెక్టర్‌గా శృతిఓజా
- గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డి
- రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు