శాట్స్‌లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు:దినకర్ బాబు

Iam ready to co operate to enquiry says dinakarbabu
Highlights

ఏసీబీ విచారణకు పూర్తి సహకారం

హైదరాబాద్: శాట్స్ లో  ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని ఎండీ దినకర్ బాబు
ప్రకటించారు. స్పోర్ట్స్ కోటాలో  మెడికల్ సీట్లు పొందిన విషయమై కొనసాగుతున్న ఏసీబీ
విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్టు ఆయన చెప్పారు.

గురువారం నాడు దినకర్ బాబు మీడియాతో మాట్లాడారు.  అసోసియేషన్‌లో చోటు
చేసుకొన్న లోపాలపై  విచారణ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కొన్ని అసోసియేషన్లు
చేసిన తప్పులకు కొందరు క్రీడాకారులు బలయ్యారని ఆయన చెప్పారు.

అసోసియేషన్ల మధ్య నెలకొన్న విబేధాలు ఈ వ్యవహరానికి కారణమయ్యాయని ఆయన
అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో  ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకుగాను  
జాగ్రత్తలు తీసుకొంటామని ఆయన చెప్పారు.

ఏసీబీ విచారణ జరిగిన తర్వాత మెడికల్ సీట్ల కేటాయింపు విషయమై నిబంధనావళిలో
మార్పులు చేర్పులు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఏసీబీ అధికారులు అడిగిన
ప్రశ్నలకు తాను సమాధానమిచ్చినట్టుగా ఆయన చెప్పారు.

ఏసీబీ విచారణ పూర్తైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై సమగ్ర నివేదికను
ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.
 

loader