హైదరాబాద్: తాను టీఆర్ఎస్ పార్టీని వీడేదీ లేదని  తాజా మాజీ ఎమ్మెల్యే  బొడిగె శోభ తేల్చి చెప్పారు.  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన  అభ్యర్థుల జాబితాలో చొప్పదండి పేరును ప్రకటించలేదు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే   ఈ తరుణంలో ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.


సోషల్ మీడియాతో బొడిగె శోభ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది.చొప్పదండి స్థానం నుండి ఎవరి పోటీ చేస్తారనే విషయాన్ని ఇంకా  టీఆర్ఎస్ తేల్చలేదు. కానీ, ఆమె మాత్రం ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ తనకే టిక్కెట్టు ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు.

మరోసారి తనకు కేసీఆర్ టిక్కెట్టు కట్టబెడతారని ఆమె అభిప్రాయపడ్డారు.  ఈ తరుణంలో  ఓ మీడియాతో ఆమె సోమవారం నాడు మాట్లాడారు  తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. 

కేసీఆర్ మోరసారి తనకే టిక్కెట్టును ఇస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తున్నారని, ప్రచారంలో కూడ ప్రజల నుండి మంచి స్పందన వస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.