జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఆయన పని ఆయన చేసుకొంటున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.


హైదరాబాద్: జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఆయన పని ఆయన చేసుకొంటున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.మంగళవారం నాడు లోటస్ పాండ్ లో నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో మాట్లాడిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తాను మాత్రం తెలంగాణలో నా పని నేను చేసుకొంటానని ఆమె స్పష్టం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:రాజన్న రాజ్యం మనతోనే సాధ్యం: షర్మిల

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరేళ్లు దాటినా ఏ ఒక్క వర్గం కూడ సంతోషంగా లేరన్నారు.రైతులు, విద్యార్ధులు, సంతోషంగా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు.ప్రతి ఒక్కరికి ఇళ్లు వచ్చాయా అని ఆమె అడిగారు. ప్రతి జిల్లావారితో మాట్లాడానికే వచ్చానన్నారు. చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆమె తెలిపారు. చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. రాజన్న రాజ్యం తేవాలనేది తన కంటే నల్గొండ జిల్లాకు చెందిన నేతలు పట్టుదలగా ఉన్నారని చెప్పారు.

తెలంగాణలో పాదయాత్ర చేసే అవకాశం కూడ ఉందని ఆమె మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అయితే పాదయాత్ర ఎప్పుడు చేస్తారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.