హైకోర్టు తీర్పును అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని కోరా: జలగం వెంకటరావు

కొత్తగూడెం ఎమ్మెల్యే  విషయంలో  హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని  కలిసి కోరినట్టుగా  జలగం వెంకటరావు చెప్పారు.

Iam Appeal To Implement Telangana High Court  order over  Kothagudem  MLA Issue lns

హైదరాబాద్: హైకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని కలిసినట్టుగా  జలగం వెంకటరావు  చెప్పారు.బుధవారంనాడు ఉదయం  తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుతో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో  జలగం వెంకటరావు మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడిన విషయాన్ని ఆయన మీడియాకు చెప్పారు. స్పీకర్ సూచనతో తాను  అసెంబ్లీ సెక్రటరీని  కలిసినట్టుగా  ఆయన వివరించారు.ఇవాళ  మధ్యాహ్నం మూడున్నర గంటలకు  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్ తో సమావేశం కానున్నట్టుగా ఆయన తెలిపారు.  

2014 లో  ఖమ్మం జిల్లా నుండి టీఆర్ఎస్ నుండి గెలిచిన  ఏకైక ఏమ్మెల్యే తానేనని ఆయన గుర్తు చేశారు. ఆనాటి నుండి తాను   కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నట్టుగా  చెప్పారు. అయితే  కొన్ని ఇబ్బందికర పరిస్థితులు జరిగాయన్నారు.ఈ విషయాలన్నీ మీకందరికి తెలిసినవేనని ఆయన చెప్పారు.  పార్టీకి చెందిన  నేతలందరితో  తాను మాట్లాడుతున్నానని  ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను  ఏం చేశానో కొత్తగూడెం  ప్రజలకు  తెలుసునన్నారు.  తాను ఏం చేయాలో  కూడ తనకు ఎజెండా ఉందన్నారు. 

also read:తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీతో జలగం వెంకటరావు భేటీ: హైకోర్టు కాపీ అందజేత

హైకోర్టు తీర్పుపై  వనమా వెంకటేశ్వరరావు  సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారని మీడియా ప్రతినిధులు  ప్రస్తావించారు. అయితే  వనమా వెంకటేశ్వరరావు ఆయన  చేయాల్సిన పనులు ఆయన  చేస్తారు. తన పనులు తాను  చేస్తానని  ఆయన చెప్పారు.  ప్రజల ఓట్లతో  విజయం సాధించాలి,  కోర్టు తీర్పులతో  విజయం సాధించడం ఏమిటని  వనమా వెంకటేశ్వరరావు  చేసిన  కామెంట్స్ పై  వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.  హైకోర్టు తీర్పులో  అన్ని అంశాలను  ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
రాజ్యాంగానికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని ఆయన  చెప్పారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios