కాంగ్రెస్ పార్టీలో చేరుతా: తేల్చేసిన రేఖా నాయక్
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. బీఆర్ఎస్ టిక్కెట్టు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేఖానాయక్ నిర్ణయం తీసుకున్నారు.
ఆదిలాబాద్:తాను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పష్టం చేశారు.తన ఎమ్మెల్యే పదవికాలం పూర్తయ్యే వరకు బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని రేఖానాయక్ వివరించారు.
కాంగ్రెస్ పార్టీ నుండి తాను బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనను బీఆర్ఎస్ నాయకత్వం పక్కన పెట్టడానికి కారణాలు తెలియదన్నారు. ప్రజల్లో ఉండడం కోసం ఏదో ఒక పార్టీ అవసరమన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా రేఖా నాయక్ చెప్పారు. ఇవాళ ఆమె ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి జాన్సన్ నాయక్ కు చోటు దక్కింది. ఇదే అసెంబ్లీ స్థానం నుండి 2014, 2018 ఎన్నికల్లో రేఖానాయక్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు.
also read:బీఆర్ఎస్ మొండి చేయి: కాంగ్రెస్ టిక్కెట్టు కోసం రేఖా నాయక్ ధరఖాస్తు
కానీ పలు కారణాలతో ఈ దఫా రేఖానాయక్ బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఈ నెల 21న రాత్రి రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ అసెంబ్లీ సీటు కోసం శ్యాం నాయక్, ఖానాపూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రేఖానాయక్ ధరఖాస్తులు సమర్పించారు.