తాను రాజకీయాలకు పనికిరానని  సీని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో ఆయన టికెట్ ఆశించగా.. టికెట్ లభించలేదు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించారు. సడెన్ గా ఇటీవల ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటించారు. దీనిపై ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

‘‘ నేను రాజకీయాలకు పనికి రాను. ఆ విషయం అందులో చేరాక అర్థమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయలేనని భయమేసింది. రాజకీయాలు నాకు అవసరమా అనిపించింది. తొందరపడి నిర్ణయం తీసుకున్నానని అనిపించింది. ఇందులోకి అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇందులోనే కంటిన్యూ అయితే.. అడ్రస్ గల్లంతు అవుతుందని గ్రహించా అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నా’’ అని చెప్పారు.

‘‘ రాజకీయాల్లో అన్నీ అబద్ధాలే చెప్పాలి. అందరితోనూ శత్రుత్వం పెంచుకోవాలి. వ్యక్తిగతం వేరు... రాజకీయం వేరని అనుకున్నాను. నా ఆప్తులంతా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారు. రాజకీయాల వల్ల వాళ్లందరికీ దూరం అయితపోతున్నామోనని భయమేసింది. ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర పడటం నాకిష్టం లేదు. అబద్ధాలతో రాజకీయాల్లో నటించేబదులు.. హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చుగా అనిపించింది’’ అని బండ్ల గణేష్  చెప్పారు.