అమరావతి: పీసీసీ రేసులో తాను లేనని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తాను ఏనాడూ కూడ వెన్నుచూపి పారిపోయే వ్యక్తిని కాదన్నారు.

శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో  మాట్లాడారు. పీసీసీ  పదవిని తాను అడిగితే సీఎల్పీ నేతగా వైఫల్యం చెందినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ను ఎదుర్కొని నిలబడతానని ఆయన  స్పష్టం చేశారు.  వెన్ను చూపి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. పీసీసీ చీఫ్ పదవి రేసులో తాను లేనని ఆయన తేల్చిచెప్పారు.

పీవీ నరసింహారావుపై  చేసిన వ్యాఖ్యలకు గాను  మాజీ మంత్రి చిన్నారెడ్డి  వివరణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని  ఆయన ఆరోపించారు.