ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్లిన తెలుగు హత్యకు గురైంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఆమెపై దాడి చేయగా..ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో అమ్మాయి తీవ్ర గాయాల పాలైంది.ఈ కేసులో బ్రెజిల్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులపై దాడులు ఆగటం లేదు. టెక్సాక్ కాల్పుల్లో హైదరాబాద్ యువతి ఐశ్వర్య హత్య ఘటన మరువక ముందే మరో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్లిన మరో తెలుగు అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఆమెపై దాడి చేయగా.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో అమ్మాయి తీవ్ర గాయాల పాలైంది.ఈ కేసులో బ్రెజిల్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు హైదరాబాద్‌కు చెందిన కొంతం తేజస్విని (27)గా గుర్తించారు. ఆమె మాస్టర్స్ డిగ్రీ కోసం మూడేళ్ల క్రితం లండన్ వెళ్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో ఇంటికి వచ్చిన ఆమె పెళ్లి కారణంగా త్వరలో మళ్లీ రావాల్సి ఉంది. ఈ తరుణంలో బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు.. తేజస్వినితో పాటు అఖిల అనే మరో విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ దుండగుడి దాడిలో తేజస్విని తీవ్ర గాయాలపాలైన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దాడిలో మరో యువతి అఖిలకు తీవ్ర గాయపడింది. ఈ క్రమంలో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు బ్రెజిల్ నివాసి, అతని పేరు కెవిన్ ఆంటోనియో లారెన్స్ జి. మోరిస్ (25). వీరితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. తేజస్విని బంధువు విజయ్ మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం డి మోరిస్ ఆ మహిళతో కలిసి జీవించేందుకు వెళ్లాడని తెలిపారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు నిందితులు దాడి చేశారని లండన్‌లోని సీనియర్ పోలీసు అధికారి లిండా బ్రాడ్లీ తెలిపారు. దాడిలో కత్తిపోట్లకు గురైన మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయంలో పోలీసులు పోలీసులకు సహకరిస్తున్నారు. నిపుణుల బృందం నిరంతరం పని చేస్తుందని, త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.
మరో భారతీయుడి మరణం
సెంట్రల్ ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌లోని ఓ వీధిలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి ఒకరు కత్తితో దాడి చేసి మరణించారు. దీంతో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం ప్రకారం, భారతీయ సంతతికి చెందిన గ్రేస్ ఓ మల్లీ (19) తన స్నేహితురాలు బర్నాబీ వెబర్ (19)తో కలిసి ఉండగా మంగళవారం తెల్లవారుజామున నిందితులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
