Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన జంట.. రోడ్డుపై అందరూ చూస్తుండగానే రొమాన్స్.. (వీడియో)

హైదరాబాద్‌లో రాత్రి వేళ నడిరోడ్డుపై ఓ జంట రెచ్చిపోయి ప్రవర్తించింది. కదులుతున్న కారు సన్ రూఫ్‌ నుంచి బయటకు కనిపించేలా నిల్చుని రొమాన్స్‌ చేసింది.

Hyderabad Video of couple kissing on moving car roof goes viral ksm
Author
First Published Oct 15, 2023, 1:43 PM IST

హైదరాబాద్‌లో రాత్రి వేళ నడిరోడ్డుపై ఓ జంట రెచ్చిపోయి ప్రవర్తించింది. కదులుతున్న కారు సన్ రూఫ్‌ నుంచి బయటకు కనిపించేలా నిల్చుని రొమాన్స్‌ చేసింది. కారు వేగంగా ముందుకు సాగుతుండగా.. ఈ జంట మాత్రం ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. రోడ్డుపై ఎవరూ చూస్తున్నారనేది పట్టించుకోకుండా రొమాన్స్‌లో మునిగితేలారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆ వీడియోలో జంట ప్రయాణిస్తున్న కారు నెంబర్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారడంతో.. పలువురు నెటిజన్లు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు బహిరంగ అసభ్యతను ఎందుకు ఆపడానికి ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రెసిడెన్షియల్ ఏరియాల్లో సోదాలు  చేపడుతున్నారని.. కానీ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్  వే, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

 


సురక్షితం కానీ డ్రైవింగ్ మోడ్, ప్రజలకు కలిగే అసౌకర్యంపై హైదరాబాద్ పోలీసులు చర్య తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు మరికొందరు ఈరోజుల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయని అంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. ఇక, అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది?, నడిరోడ్డుపై ఇలా రొమాన్స్ చేసిందని ఎవరు?, ఆ దృశ్యాలను చిత్రీకరించింది ఎవరు? అనే విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios