Asianet News TeluguAsianet News Telugu

ఈ టిఆర్ఎస్ నేత కొడుకు అమ్మాయిలతో  మళ్లీ అదే పని

  • సైబర్ లైంగిక వేధింపుల కేసులో సెప్టెంబరులోనే అరెస్టు
  • అమ్మాయిల మొహాలను బూతుబొమ్మలకు తగిలించి వేధింపులు
  • జైలుకు పోయి బెయిల్ మీద బయటకొచ్చిన అభిషేక్ గౌడ్
  • మళ్లీ అదేరీతిలో అమ్మాయిలను సైబర్ సెక్స్ చేయాలంటూ వేధింపులు
  • నిందితుడు టిఆర్ఎస్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్
hyderabad trs corporator son abhishek goud again arrest

హైదరాబాద్ నగరంలో ఒక అధికారపార్టీ కార్పొరేటర్ కొడుకు మరోసారి వక్రబుద్ధి చూపాడు. గతంలో సోషల్ మీడియాలో అమ్మాయిలను వేధించాడు. అక్కా అంటూనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తీరా పోలీసులు పక్కా ఆధారాలతో సహా అతడిని గుర్తించి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవల బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే వక్రబుద్ధి అమ్మాయిల నగ్న చిత్రాలు మార్పింగ్ చేసి వేధింపులు షురూ చేసిండు. మల్లా పోలీసులు అరెస్టు చేసి రెండోసారి బొక్కలో వేసిర్రు. రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మల్కాజ్ గిరి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్ అనే పేరు హైదరాబాద్ జనాలకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబరు ఈ పేరుగల్ల వ్యక్తి చేసిన బాగోతాలను పోలీసులు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చి అతడిని కటకటాల వెనక్కు నెట్టారు. సెప్టెంబరు మాసంలో అతడిని అరెస్టు చేశారు. అప్పుడు ఫేస్ బుక్ వాట్సాప్ లలో తన చిన్ననాటి క్లాస్ మెట్స్ ను, స్కూల్ మేట్స్ ను వేధించాడు. వారి ఫొటోలకు నగ్నచిత్రాలను మార్ఫింగ్ చేసి తనతో స్నేహం చేయకపోతే వాటిని ఇంటర్ నెట్ లో ఉంచుతానని బెదిరించాడు. అక్కా అంటూనే అమ్మాయిలను వేధింపులకు గురిచేసి సంచలనం సృష్టించాడు. తుదకు పోలీసులు అరెస్టు చేశారు.

hyderabad trs corporator son abhishek goud again arrest

రెండు నెలల క్రితమే అరెస్టయిన అభిషేక్ ఇటీవల బెయిల్ మీద బయటికొచ్చిండు. సరే బుద్ధిగా ఉంటాడనుకుంటే మళ్లీ తన వక్రబుద్ధిని చాటిండు. వర డార్లింగ్ అనే పేరుతో మల్కాజ్ గిరి యువతి (25)కి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిడు. అమ్మాయి ఫొటోతో ఉండడంతో ఆమె అంగకరించింది. దీంతో తర్వాత ఆమెకు చుక్కలు చూపిండు. నగ్న చిత్రాలు, నీలిచిత్రాల వీడియోలు పంపడం షురూ చేసిండు. అంతేకాకుండా తనతో సైబర్ సెక్స్ చేయాలంటూ ఆమెమీద వత్తిడి చేసిండు. ఈ తతంగంపై ఆమె వర డార్లింగ్ అనే మారుపేరుతో ఉన్న అభిషేక్ గౌడ్ ను తిట్టింది. అయితే వెంటనే మరో పని చేసిండు. ఆ అమ్మాయి ఫొటోను నగ్న చిత్రంగా మార్ఫింగ్ చేసి ఆమెకే పంపిండు. దీంతో ఆ యువతి ఆందోళన చెంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమెతోపాటు ఇలా 52 మంది అమ్మాయిలకు సదరు అభిషేక్ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిండు. అయితే తనమీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనుమానం వచ్చిన అభిషేక్ గౌడ్ అతి తెలివి ప్రదర్శించిండు. తన ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేయడంతోపాటు తన ఫోన్ కూడా క్రష్ చేసిండు. అయినా పోలీసుల సాంకేతిక వనరుల ముందు అతడి అతి తెలివి పనిచేయలేదు. నాగోల్ క్రాస్ రోడ్డులో అతడిని వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. అయితే అతడిని విచారించిన తర్వాత టిఆర్ఎస్ కార్పొరేటర్ కొడుకు అభిషేక్ గౌడ్ గా తెలుసుకుని ఖంగుతిన్నారు పోలీసులు. గత రెండు నెలల క్రిందటే ఇదే రకమైన వేధింపుల కేసులో జైలుపాలైన తర్వత కూడా అతడికి బుధ్ది రాలేదా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. రిమాండ్ కు తరలించారు.  ఈవివరాలను రాచకొండ సిపి మీడియాకు తెలిపారు. 

ఈ అభిషేక్ గౌడ్ అరెస్టు కాకముందు అమ్మాయిలతో రేవ్ పార్టీలో ఎలా రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడో కింద వీడియోలో చూడండి

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios