హైద్రాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: ఒక్క రోజే 3535 కేసులు నమోదు
హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై 3535 కేసులను నమోదు చేశారు పోలీసులు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ తో పాటు ట్రిపుల్ రైడింగ్ నిర్వహిస్తున్నవారిపై చర్యలు తీసుకొంటున్నారు.
హైదరాబాద్: నగరంలో భారీగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిన్నటి నుండి ట్రాఫిక్ నిబంధలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలపై నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 3,535 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2981 రాంగ్ రూట్ ,554 ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదైనట్టుగా పోలీసులు కేసులు పెట్టారు.
నగరంలోని 25 ప్రాంతాల్లో ట్రాఫిక్ పై పోలీసులు కేంద్రీకరించారు.ఆ తర్వాత నగరంలోని అన్ని ప్రాంతాలపై పోలీసులు కేంద్రీకరించనున్నారు. స్పెషల్ డ్రైవ్ సందర్భంగా పట్టుబడిన వారిపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై ఎంబీ చట్టంలోని 119/177 , 184 సెక్షన్ల కింద కేసులు బుక్ చేస్తారు. ట్రిపుల్ రైడింగ్ లో పట్టుబడిన వారిపై ఎంవీ చట్టంలోని సెక్షన్ 128/184 ఆర్/ డబ్ల్యు 177 కింద కేసులు నమోదు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
also read:హైద్రాబాద్‌లో పుట్‌పాత్‌ల ఆక్రమణ: 553 మందిపై క్రిమినల్ కేసులు
గత మాసంలో ట్రాఫిక్ పోలీసులు హైద్రాబాద్ లో రోప్ విధానాన్ని అమలు చేశారు. అయితే ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. పుట్ పాత్ ల ఆక్రమణలకు పాల్పడేవారిపై పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. పుట్ పాత్ లపై వ్యాపారాలు చేసేవారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పుట్ పాత్ లను ఆక్రమిస్తే చర్యలు తీసుకొంటామని గతంలోనే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫ్రీ లెఫ్ట్ తో పాటు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద లైన్ ను దాటితే చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రోప్ అమలులో భాగంగా ఈ నెల 28 నుండి రాంగ్ రూట్ లో డ్రైవింగ్ , ట్రిపుల్ డ్రైవింగ్ పై పోలీసులు కేంద్రీకరించారు.