హైదరాబాద్: హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రమాదం ఉందని  హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్  ఓవైసీ అనుమానం వ్యక్తం చేశారు.

జమ్మూ కాశ్మీర్ విభజన అంశంపై పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న సమయంలో హైద్రాబాద్ అంశాన్ని అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. 

హైద్రాబాద్‌తో పాటు చెన్నై, బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను యూటీలుగా మారుస్తారని ఆయన జోస్యం చెప్పారు.ఇందుకు ఉదహరణే కాశ్మీర్ అని ఆయన తెలిపారు.


భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలను యూటీలుగా మార్చే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇదే బీజేపీ విధానం,గా ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ విభజనే ఇందుకు ఉదహరణగా ఆయన చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం సరైందికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు కేటాయింపులు పెరిగాయని మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.కేటాయింపులు పెరగలేదన్నారు.

మైనార్టీ వ్యవహారాల శాఖకు బడ్జెట్ లో 1024 కోట్లు తగ్గించారని ఆయన ఆరోపించారు. మంత్రిత్వశాఖ బడ్జెట్ అంచనా రూ. 5,029 కోట్లుంటే, సవరించిన అంచనా రూ. 4,005 కోట్లకు తగ్గించినట్టుగా చెప్పారు. ఈ కోత 20.36 శాతానికి చేరుకొందన్నారు.