హైదరాబాద్: దొంగతనానికి వచ్చిన  ఓ వ్యక్తి తప్పించుకొనే క్రమంలో మూడో ఫ్లో‌ర్‌ నుండి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

కొత్తగూడెం జిల్లాకు చెందిన బి. మహేష్‌ ప్రైవేట్ ఎంప్లాయి.  తన భార్యతో కలిసి ఆయన హైద్రాబాద్‌లోని నార్సింగి, పుప్పాలగూడలో దుర్గా నగర్‌లో నివాసం ఉంటున్నాడు.ఇక్కడ మూడో ఫ్లో‌ర్‌లో ఆయన నివాసం ఉంటున్నాడు.

వేసవి కావడంతో  తన భార్యతో కలిసి ఆయన టెర్రస్‌పైన పడుకొన్నారు. అయితే రాత్రి 11 గంటల 30 నిమిషాలకు మహేష్‌ తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేందుకు వచ్చాడు.అయితే అప్పటికే తన రూమ్‌లో లైట్  వేసింది. దీంతో అనుమానం వచ్చిన మహేష్‌ కిటీకీ సందులో నుండి తొంగి చూశాడు.  అయితే అప్పటికే  ఓ కొత్త వ్యక్తి ఆ ఇంట్లో  చూశాడు. 

తమ రూమ్‌లో దొంగ ఉన్నట్టు గుర్తించిన మహేష్‌ అతడిని పట్టుకొనే ప్రయత్నం చేశాడు. అయితే దొంగ పారిపోయేక్రమంలో మూడో ఫ్లోర్‌ నుండి కిందపడిపోయాడు. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని బాలుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుండి కొంత నగదును మహేష్‌కు చెందిన గడియారం పోలీసులు రికవరీ చేశారు.