దుబ్బాక ఎస్సైగా పనిచేస్తున్న చిట్టిబాబును ఇటీవల పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు.

రాష్ట్రంలో పోలీసుల ఆత్యహత్యలు ఎక్కువవుతున్నాయి. మూడు నెలల్లో ముగ్గరు పోలీసులు వివిధ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌క్వార్టర్స్లో ఓ ఎస్సై భార్యను సర్వీసు రివాల్వర్‌తో కాల్చి చంపి తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దుబ్బాక ఎస్సైగా పనిచేస్తున్న చిట్టిబాబును ఇటీవల పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది.

దీంతో తీవ్ర నిరాశకులోనైన చిట్టిబాబు తన భార్యను సర్వీసు రివాల్వర్‌తో కాల్చి చంపి తనూ కాల్చుకున్నాడు.

అయితే చిట్టిబాబు ఇంత తీవ్ర నిర్ణయాన్ని తీసుకోడానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.

కాగా, ప్రజాసంఘాలు, దళిత సంఘాల కూడా దీనిపై ఆందోళనకు దిగాయి.