ఎయిర్‌పోర్టులోకి అనుమతించలేదని బాంబు బెదిరింపు: శంషాబాద్ పోలీసుల అదుపులో నిందితుడు

చెన్నై-హైద్రాబాద్  విమానంలో  బాంబు పెట్టినట్టుగా  అతి తెలివితో  ఫోన్  చేసిన వ్యక్తి ని హైద్రాబాద్ శంషాబాద్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Shamshabad   Police  detained  man  For  Bomb Threat Call  ChennaiHyderabad  Flight


హైదరాబాద్: చెన్నై-హైద్రాబాద్  విమానంలో  బాంబు పెట్టామని  ఫోన్  చేసిన వ్యక్తిని  హైద్రాబాద్ శంషాబాద్  పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై-హైద్రాబాద్ వెళ్లే  విమానంలో  బాంబు పెట్టినట్టుగా    ఇవాళ   ఫోన్  వచ్చింది. విమానం బయలుదేరాల్సిన సమయంలో  ఈ ఫోన్ రావడంతో  అంతా అలర్ట్  అయ్యారు . తనిఖీలు  చేపట్టారు. మరో వైపు  ఈ ఫోన్  ఎవరు చేశారనే విషయమై  కూడా పోలసులు  ఆరా తీశారు.  

 ఆజ్మీరా భద్రయ్యఅనే వ్యక్తి  ఈ ఫోన్  చేసినట్టుగా  గుర్తించారు. అతడిని  అదుపులోకి తీసుకుని  ప్రశ్నిస్తే  అసలు విషయం వెలుగు చూసింది.  ఇదే విమానంలో  ఆజ్మీరా భద్రయ్య  చెన్నైకి  వెళ్లాల్సి ఉంది.  శంషాబాద్  ఎయిర్‌పోర్టుకి  భద్రయ్య ఆలస్యంగా  వచ్చాడు.  దీంతో  సీఐఎస్ఎఫ్ సిబ్బంది  భద్రయ్యను  ఎయిర్ పోర్టులోకి అనుమతించలేదు.. దీంతో  చెన్నై-హైద్రాబాద్ వెళ్లే  విమానంలో  బాంబు పెట్టినట్టుగా  ఫోన్  చేశాడు.  ఈ ఫోన్  చేసిన భద్రయ్యను గుర్తించిన  శంషాబాద్  పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైట్  మిస్ కాకుండా  ఉండేందుకు  అతి తెలివితో  భద్రయ్య  చేసిన  ఫోన్  కాల్  అతడిని పోలీసులకు చిక్కేలా  చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios