హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు: దోషిగా మరో నిందితుడు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 10, Sep 2018, 11:35 AM IST
Hyderabad serial blasts verdict
Highlights

గోకుల్‌చాట్, లుంబిన్ పార్క్‌లలో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం దోషులకు శిక్ష ఖరారు చేసింది. చర్లపల్లిలోని ప్రత్యేక కోర్టులో దోషులకు శిక్ష విధిస్తూ నాంపల్లి మెట్రోపాలిటిన్ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు

గోకుల్‌చాట్, లుంబిన్ పార్క్‌లలో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం దోషులకు శిక్ష ఖరారు చేసింది. చర్లపల్లిలోని ప్రత్యేక కోర్టులో దోషులకు శిక్ష విధిస్తూ నాంపల్లి మెట్రోపాలిటిన్ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు.

ఈ కేసులో మరో నిందితుణ్ణి దోషిగా చేర్చింది.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారిఖ్ అంజూమ్‌‌ను మూడో దోషిగా తేల్చింది. సరైన ఆధారాలు లేని కారణంగా ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పటికే అక్బర్ ఇస్మాయిల్ చాదరి, అనీఖ్ షఫీఖ్ సయ్యద్‌లను దోషులుగా నిర్థారించింది. 

2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల వద్ద జరిగిన జంట పేలుళ్లలో 44 మంది ప్రజలు మరణించారు. దీనిపై నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. 11 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన సిట్ ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించింది.

ఈ కేసులో బాంబులు పెట్టిన అనీఖ్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి నేరం చేసినట్లుగా తేల్చింది.. మరో ఇద్దరు నిందితులు సాదిఖ్ ఇష్రార్ షేక్, ఫరూఖ్ షర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను నిర్దోషులుగా పేర్కొంది. 

loader