హైదరాబాద్ లో ఓ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్  ఆర్టిస్టులు మృతి చెందారు. చనిపోయిన Junior Artistల్లో ఒకరి పేరు మానసగా తెలుస్తోంది. హైదరాబాద్ లో  ఇటీవలి కాలంలో రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో కారు ప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధూ తీవ్రంగా గాయపడ్డాడు.

కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతోRoad accident సంభవించింది. మృతి చెందిన Junior Artistల్లో ఒకరి పేరు మానసగా తెలుస్తోంది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో జరిగింది. కారు డ్రైవర్ ను అబ్దుల్లాగా గుర్తించారు. ఇతను విజయవాడలో ఓ బ్యాంక్ ఉద్యోగి అని సమాచారం. మృతి చెందిన ఇద్దరు జూనియర్ ఆర్టిస్టుల పేర్లు కూడా మానసనే. ఒకరు కర్ణాటకకు చెందినవారు కాగా, మరొకరు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు. అతి వేగం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢికొట్టింది. దీంతో కారు రెండు ముక్కలైంది. ప్రమాదానికి గురైన కారుపై 15 చలాన్లు ఉన్నాయి. ఓవర్ స్పీడ్ కారుణంగా వేసిన చలాన్లు 14 ఉన్నాయి.

మరణించిన ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కూడా హాస్టల్లో ఉన్నారు.. కారులో ప్రయాణించిన నలుగురు కూడా మిత్రులని తెలుస్తోంది. ఇద్దరు మానసలు కూడా వెనక సీట్లో కూర్చున్నారు. కారులోని బెలూన్లు కూడా రక్షించలేని స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. వారు మద్యం సేవించి ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా ప్రమాద జరిగింది. టీ సేవించేందుకు వారు లింగంపల్లికి బయలుదేరినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో మందుబాబుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. కొద్దిరోజులుగా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా కొందరు డ్రంకెన్ డ్రైవ్ (drunken drive) చేస్తూ తమ ప్రాణాలనే కాదు ఎదుటివారిని రిస్క్ లో పడేస్తున్నారు. తాజాగా శుక్రవారం బంజారాహిల్స్ (banjarahills) ప్రాంతంలో మందుబాబులు కారును పల్టీలు కొట్టిస్తూ నానా బీభత్సం సృష్టించారు.

పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని నాగార్జున సర్కిల్ నుండి ఓ ఐ20 కారు బంజారాహిల్స్ వైపు మితిమీరిన వేగంతో దూసుకువెళుతూ ప్రమాదానికి గురయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో వేగంగా దూసుకుపోతున్న కారుకు ఓ స్కూటీ అడ్డొచ్చింది. అయితే దీన్ని తప్పించబోయి కారు అదుతప్పింది.

స్కూటీని తప్పించే క్రమంలో డ్రైవర్ కారును డివైడర్ వైపు తిప్పారు. దీంతో కారు డివైడర్ కు ఢీకొని గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డుకు అవతలివైపు దూసుకెళ్లింది. అయినా కారు అదుపులోకి రాకుండా వేగంగా దూసుకెళ్లి మరో కారును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలి ముగ్గురు యువకులు పరారయ్యారు. మద్యం మత్తులో కారును నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన యువకులు ఎవరన్నది తెలియాల్సి వుంది. 

ఐ20 కారు ఢీకొట్టడంతో ఎదురుగా వున్న కారులోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గాయపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మహ్మద్‌ ఆరిఫ్, ప్రణతి, దీక్ష, గ్లోరియా, సాయిలక్ష్మి, తేజస్విరెడ్డి, దుర్గా రాకేష్‌, గణేశ్‌ గాయపడ్డారు. అతివేగంతో ఢీకొనడంతో ఐ20 కారులో పాటు మరో కారు కూడా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి గురయిన సాఫ్ట్ వేర్ యువతీయువకులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ఐ20కారు ఎవరిదనేది గుర్తించే పనిలో పడ్డారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన మందుబాబుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

ఇదిలావుంటే ఈ నెలలోనే హైదరాబాద్ లో చాలా డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 5వ తేదీ ఆదివారం రోజున మందుబాబుల వల్ల జరిగిన రెండు వేరువేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేసే అయోధ్యరాయ్‌, దేవేంద్రకుమార్‌ దాస్‌ మృతిచెందారు. మద్యం మత్తులో కారు నడిపింది రోహిత్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. 

అలాగే నగరంలోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. నార్సింగ్ ఎంజీఐటీ వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ టీఎస్ 07 ఈజెడ్ 6395 నెంబర్‌ గల బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతులు ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని రాజు, మౌనికలుగా గుర్తించారు. రాజు పాల వ్యాపారం చేస్తుంటాడని, నార్సింగి మున్సిపాలిటీలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఈ దంపతుల ప్రాణాలను బలితీసుకున్నాడు.