Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ రియల్టర్ కిడ్నాప్, హత్య: నలుగురి అరెస్టు, బాబా కోసం గాలింపు

హైదరాబాద్ రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బాబా కోసం గాలిస్తున్నారు.

Hyderabad real estate businessman kidnaped and killed at Sunnipenta
Author
Hyderabad, First Published Aug 7, 2021, 12:32 PM IST

హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త, రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. అతన్ని హైదరాబాదులోని అతని నివాసం నుంచి కిడ్పాప్ చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాబా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందినవాడని తెలుస్తోంది. 

ఇటీవల విజయ్ భాస్కర్ రెడ్డి కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన అల్లుడు నీరజ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు. ఈ దర్యాప్తులో విజయ్ భాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

విజయ్ భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చిన నిందితులు ఆయనకు మత్తు కలిపిన మంచూరియాను తినిపించారు. ఆయన స్పృహ కోల్పోగానే కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఆయనను శ్రీశైలం తీసుకుని వెళ్లారు. హత్య చేసిన ఆయన మృతదేహానికి సున్నిపెంటలో అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలకు నిందితులు అక్కడి కాటికాపరికి 11 వేల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

విజయ్ భాస్కర్ రెడ్డిని కారులో ఎక్కించుకుని తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా కిడ్నాప్ నకు వాడిన కారు నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విదేశాల నుంచి డబ్బు తెప్పిస్తానని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తానని విజయ్ భాస్కర్ రెడ్డి బాబాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీ నిలబెట్టుకోకపోవడం వల్లనే బాబా విజయ్ భాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేయించి, హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

రియల్టర్ విజయ్ భాస్కర్ ను కిడ్నాప్ చేయించి, హత్య చేయించిన బాబాను త్రిలోక్ నాథ్ గా గుర్తించారు. త్రిలోక్ నాత్ భాబా కోసం పోలీసులు గుర్తించారు. అక్రమాలు బయటపెట్టినందుకు త్రిలోక్ నాథ్ బాబా విజయ్ భాస్కర్ రెడ్డి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. తన అక్రమాలను బయటపెట్టవద్దని త్రిలోక్ నాథ్ బాబా హెచ్చరించినా విజయ్ భాస్కర్ రెడ్డి వినలేదని సమాచారం. సుపారీ ఇచ్చి త్రిలోక్ నాథ్ బాబా విజయ్ భాస్కర్ ను కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో త్రిలోక్ నాథ్ బాబు శిష్యులు కూడా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios