వినడానికి ఇదో వింత కేసు.. కానీ వివరాలు తెలిశాక.. ఆ దొంగల తెలివికి ఆశ్చర్యం వేస్తుంది. పోలీసులు దాన్ని రెండు రోజుల్లోనే చేధించడం మరో ఆశ్చర్యం అనిపిస్తుంది.ఇంతకీ అదేం దొంగతనం అంటే మొక్కను కొట్టేశారు. అదీ సాక్షాత్తూ రిటైర్డ్ డీజీపీ ఇంట్లో.. ఒక మొక్క కోసం ఇంతకి తెగించారంటే ఆ మొక్క ఎంత స్పెషలై ఉండాలో కదా..

ముందుగా వివరాల్లోకి వెడితే.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో రిటైర్డ్‌ డీజీపీ ఇంటి ఆవరణలో మొక్క మాయం అయ్యిందనే ఓ ఆసక్తికరమైన కేసు తాజాగా నమోదైంది. ఈ మేరకు సదరు డీజీపీ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మొక్కను దొంగిలించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆ విలువైన మొక్కను కూడా స్వాధీనం చేసుకున్నారు.

రిటైర్డ్ డీజీపీ అప్పారావు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఆయన తన ఇంటి ముందు కొన్ని మొక్కలు, చెట్లు పెంచుకుంటున్నారు. అందులో ఒకటే ఇప్పుడు ఛోరీకి గురయ్యింది. అదో బోన్సాయ్ మొక్క. దాన్నే ఈ నెల 12న గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. 

ఈ మొక్క చాలా ప్రత్యేకమైనదట. దీని విలువ అక్షరాలా లక్షన్నర రూపాయలు. ఇది ఎలా పసిగట్టారో కానీ దొంగలు ఆ మొక్కను ఎత్తుకెళ్లారు. తోటమాలి మొక్కలకు నీళ్లు పడుతుండగా.. బోన్సాయి మొక్క కనిపించలేదు. దీంతో.. ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పాడు. వారు దీనిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించడమే కాకుండా బోన్సాయ్ మొక్కను కూడా రికవరీ చేశారు. ఇంతకీ ఆ దొంగలకు మొక్కను ఎత్తుకెళ్లాలన్న ఐడియా ఎలా వచ్చిందో మాత్రం తెలియలేదు.