హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను బేగంపేట పోలీసులు విచారిస్తున్నారు.

మంగళవారం నాడు రాత్రి ప్రవీణ్ రావు తో పాటు ఆయన ఇద్దరు సోదరులను ఐటీ అధికారులంటూ కిడ్నాప్ చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ ను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:హఫీజ్‌పేట్ భూవివాదమే కిడ్నాప్‌నకు కారణం: బాధితుల బంధువు ప్రతాప్ రావు

కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన అఖిలప్రియను బేగంపేట పోలిస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన అఖిలప్రియ బంధువులను అనుమతి ఇవ్వలేదు.

మందులు, భోజనం పోలీసులకు ఇచ్చి అఖిలప్రియ బంధువులు వెళ్లిపోయారు. అఖిలప్రియ భర్త భార్గమ్ రామ్ కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూ వివాదమే ప్రవీణ్ రావు కిడ్నాప్ నకు కారణమైందనే పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు కిడ్నాప్ నకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు.