బెట్టింగ్‌లో డబ్బులొస్తే వస్తా, లేకపోతే సూసైడ్: రూ. 22 లక్షలు ఎత్తుకెళ్లిన వనస్థలిపురం క్యాషియర్ మేసేజ్

హైద్రాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టారని పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ లో డబ్బులు వస్తే వస్తా, లేకపోతే ఆత్మహత్య చేసకుంటానని ప్రవీణ్ కుమార్ బ్యాంకు అధికారులకు మేసేజ్ పెట్టాడు. ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Police Investigates On Vanasthalipuram Bank Of Baroda Bank Cashier Praveen Kumar Message

హైదరాబాద్: నగరంలోని Vanasthalipuram బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీ నుండి  రూ. 22 లక్షలు తీసుకెళ్లిన క్యాషియర్ ప్రవీణ్ కుమర్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. Cricket Betting లో  బ్యాంకు నుండి తీసుకెళ్లిన డబ్బులను క్యాషియర్ Praveen  పెట్టుబడిగా పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి వస్తానని లేకపోతే Suicide చేసుకొంటానని ప్రవీణ్ కుమార్  బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు.ఈ మేసేజ్ ను బ్యాంకు మేనేజర్ పోలీసులకు అందించాడు. క్రికెట్ బెట్టింగ్ లో తాను డబ్బులు నష్టపోయినట్టుగా కూడా ఆ మేసేజ్ లో ప్రవీణ్ కుమార్ వివరించారు.ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bank Of Baroda   వనస్థలిపురం బ్రాంచీలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు.ఈ నెల 10వ తేదీన యధావిధిగా విదులకు హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు తనకు కడుపులో నొప్పిగా ఉందని  బ్యాంకు మేనేజర్ కు చెప్పాడు. మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ బ్యాంకు నుండి వెళ్లిపోయాడు. బ్యాంకు ముగిసే సమయమైనా కూడా ప్రవీణ్ కుమార్ బ్యాంకుకు రాలేదు. ప్రవీణ్ కుమార్ కు బ్యాంకు సిబ్బంది ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. అనుమానం వచ్చి ప్రవీణ్ కుమార్ క్యాబిన్ చెక్ చేస్తే రూ. 22 లక్షలు మాయమైనట్టుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. 

వెంటనే బ్యాంకు మేనేజర్ Policeలకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి బ్యాంకు కు వస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ఆ మేసేజ్ లో పేర్కొన్నాడు. 

ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఉపయోగించిన సెల్ పోన్ ఆధారంగా అతను ఎక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios