సాత్విక్ కేసు: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు

నార్సింగి  శ్రీ చైతన్య కాలేజీలో  ఇంటర్ విద్యార్ధి  సాత్విక్ ఆత్మహత్య  కేసులో  కొందరిని పోలీసులు అదుపులకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Hyderabad  Police  investigates  in Satwik  suicide case

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా నార్సింగి  శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్  విద్యార్ధి  సాత్విక్  ఆత్మహత్య  కేసులో   కాలేజీ  సిబ్బందిని  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  రవి,  ఆచార్య  సహ  కొందరిని  పోలీసులు  విచారిస్తున్నారు.

ఫిబ్రవరి  28వ తేదీ రాత్రి  కాలేజీ  క్లాస్  రూమ్ లో  సాత్విక్  ఆత్మహత్య  చేసుకున్నాడు. తన ను కాలేజీలో   ఏ రకంగా వేధింపులకు  గురి చేశారనే  విషయమై  సూసైడ్  లెటర్ లో  సాత్విక్  పేర్కొన్నారు.  ఈ వేధింపులు భరించలేక తాను  ఆత్మహత్య  చేసుకున్నట్టుగా  సాత్విక్  సూసైడ్  లేఖలో  పేర్కొన్నారుు.

సాత్విక్  సూసైడ్  లేఖ ఆధారంంగా  కాలేజీకి  చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  విద్యార్ధులను  ఏ రకంగా  వేధింపులకు  గురి చేసేవారనే విషయమై  కొన్ని వీడియోలను  విద్యార్ధులు   నిన్న మీడియాకు  విడుదల చేశారు. 

also read:సాత్విక్ ఆత్మహత్య.. చైల్డ్ రైట్స్ కమీషన్ ఆగ్రహం, ఇంటర్ బోర్డ్‌కు కీలక ఆదేశాలు

సాత్విక్  ఆత్మహత్యకు కారణమైన వారిపై  చర్యలు తీసుకోవాలని కోరుతూ  కాలేజీ ముందు  పేరేంట్స్ , విద్యార్ధి సంఘాల  నేతలు  బుధవారం నాడు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో  కాలేజీ  వద్ద ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.  సాత్విక్ మృతికి  కారణమైన వారిపై  చర్యలు తీసుకుంటామని  పోలీసులు హామీ ఇవ్వడంతో  పేరేంట్స్ తమ  ఆందోళనను విరమించారు. 

నార్సింగి  శ్రీచైతన్య  కాలేజీలో  తమ పట్ల దారుణంగా వ్యవహరించేవారని  విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.  సాత్విక్  ఆత్మహత్య  నేపథ్యంలో  కాలేజీకి, హస్టల్ కు  యాజమాన్యం  సెలవులు  ప్రకటించింది.  మరో  10 రోజుల్లో  ఇంటర్ ఫస్టియర్ సెలవులను ప్రకటించింది.ఈ సమయంలో  సెలవులు  ప్రకటించడంతో  విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. 

ఆత్మహత్యలకు  పాల్పడుతున్న  విద్యార్ధులు

ఒత్తిడికి గురౌతున్న  విద్యార్ధులు  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సుమారు  20 రోజుల వ్యవధిలోనే  నలుగురు విద్యార్ధులు ఆత్మహత్యలకు  పాల్పడినట్టుగా  విద్యార్ధి సంఘాల  నేతలు  గుర్తు  చేస్తున్నారు. కాలేజీ క్యాంపస్ లలోనే  విద్యార్ధులు ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు.  సాత్విక్ ఆత్మహత్య  కంటే  ముందే  మరో ముగ్గురు విద్యార్ధులు  ఆత్మహత్యలు  చేసుకున్న విషయాన్ని  విద్యార్ధి సంఘాల నేతలు గుర్తు  చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios