హైద్రాబాద్ ఉగ్రకుట్ర కేసు: పోలీస్ కస్టడీకి ముగ్గురు నిందితులు

హైద్రాబాద్ లో గ్రైనేడ్లతో ప్రజలను భయబ్రాంతుులకు గురిచేసేందుకు  కుట్ర పన్నిన ముగ్గురు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిందితులను కోర్టు కస్టడీకి ఇచ్చింది. 

Hyderabad Police get five-day custody of three terror suspects

హైదరాబాద్: హైద్రాబాద్ లో ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకోనుంది.ఈనెల 17వ తేదీ వరకు ముగ్గురు నిందితుల విచారణ కోసం నాంపల్లి కోర్టు అనుమతిని ఇచ్చింది. దీంతో చంచల్ గూడ  జైల్లో ఉన్ననిందితులను  సిట్ బృందం కస్టడీలోకి గురువారం నాడు కస్టడీలోకి తీసుకుంటారు.

హైద్రాబాద్ లోని జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో   గ్రైనేడ్లు విసిరి  ప్రజలను భయకంపితులు చేయాలని  ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.  హైద్రాబాద్ నగరంలోని మూడుచోట్ల  ఈ దాడులు చేయాలని ప్లాన్ చేశారు. జాహెద్  అబ్దుల్‌, మహ్మద్ సమీయుద్దీన్  అలియాస్ అబ్దుల్ సమీ,  మాజ్ హసన్ ఫరూఖ్ అలియాస్ అలియాస్ మాజ్ లు ఈ దాడులకు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు. 

దసరా సందర్భంగా నిర్వహించే వేడుకల సమయంలో గ్రైనేడ్లు విసిరి  ప్రజలను భయందోళనలకు గురి చేయాలని నిందితులు  ప్లాన్  చేశారని పోలీసులు నిందితుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైద్రాబాద్ లో ఉగ్రదాడులకు జాహెద్ కీలక  పాత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు. హవాలా ద్వారా జాహెద్ కు రూ. 30 లక్షలు వచ్చాయని పోలీసులు గుర్తించారు

.  పాకిస్తాన్ నుండి  మహారాష్ట్రకు వచ్చిన  గ్రైనేడ్లను జాహెద్  టూ వీలర్  పై  హైద్రాబాద్ కు తీసుకు వచ్చాడు. రెండు గ్రైనేడ్లను తన వద్ద ఉంచుకొన్నాడు. మిగిలిన రెండు గ్రైనేగ్లను మరో ఇద్దరు నిందితులను  జాహెద్ అందించాడు.  గ్రైనేడ్లు ఎలా ఉపయోగించాలనే విషయమై నిందితులుప్రాక్టీస్ కూడా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల ఇళ్ల వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు. 

also read:హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసు: కీలక విషయాలను గుర్తించిన పోలీసులు

పాకిస్తాన్ కు చెందిన ఫర్హతుల్లా గౌరీ నుండి ఈ గ్రైనేడ్లు మహారాష్ట్రకు వచ్చాయి. ఫర్హతుల్లాకు చెందిన నెట్ వర్క్ ను పోలీసులు ట్రేస్ చేసేందుకు ఈ ముగ్గురిని  కస్టడీలోకి తీసుకున్నారు.  మరో వైపు ఈ ముగ్గురు నిందితులు ఎందరిని ఉగ్రవాదం వైపు మళ్లించారనే విషయమై పోలీసులు విచారించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios