మహేష్ బ్యాంకు సర్వర్ ను హ్యాక్ చేసి నగదును మళ్లించిన కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఆర్బీఐ, ఐటీకి సమాచారం వెళ్లకుండా సైబర్ నేరగాళ్లు జాగ్రత్తలు తీసుకొన్నారు.
హైదరాబాద్: Mahesh Bank నుండి నిధులను మళ్లించే క్రమంలో సైబర్ నేరానికి పాల్పడిన నైజీరియన్లు జాగ్రత్తలు తీసుకొన్నారు. పక్కా ప్లానింగ్ తో నిందితులు ఈ Bank server ను హ్యాక్ చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. బ్యాంక్ సర్వర్ నుండి నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించే సమయంలో రెడ్ ట్యాగ్ మోగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారని పోలీసులు గుర్తించారు. సేవింగ్స్ ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బులు బదిలీ అయితే ఆర్బీఐకి, ఐటీ శాఖకు అలారం అందుతుంది. అయితే ఈ విషయంలో నైజీరియన్లు జాగ్రత్తలు తీసుకొన్నారు.
రెడ్ ట్యాగ్ మోగితే Hacking సమాచారం RBIకి చేరుతుంది. రెడ్ ట్యాగ్ మోగకుండా సైబర్ నేరగాళ్లు జాగ్రత్తలు తీసుకొన్నారు.
వ్యాపారుల కరెంట్ ఖాతాల్లోకి భారీగా నగదును ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేశారు.
