ఆపరేషన్ గంజా ... గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటి వరకు 15 మంది గంజాయి డాన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు ధూల్‌పేట, మంగళ్‌హాట్, కర్మాన్‌ఘాట్‌లలో 24 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు

ఆపరేషన్ గంజా ... గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటి వరకు 15 మంది గంజాయి డాన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు ధూల్‌పేట, మంగళ్‌హాట్, కర్మాన్‌ఘాట్‌లలో 24 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. గంజాయి తీసుకుంటున్న వారితో పాటు అమ్మే వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి తాగుతూ దొరికితే జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. గంజాయి తాగే అలవాటు వున్న 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్ధులతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వున్నారు. మరో 50 మంది గంజాయి రీ సెల్లర్స్‌ను గుర్తించినట్లు తెలిపారు.