Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ బ్రోకింగ్ సంస్థకు షాక్: కార్వీపై హైద్రాబాద్ పోలీసుల కేసులు

 స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు కేసు నమోదు చేశారు.  కార్వీపై రెండు కేసులను సీసీఎస్ పోలీసులు పెట్టారు.

hyderabad police files case against karvy lns
Author
Hyderabad, First Published Jun 23, 2021, 11:52 AM IST


హైదరాబాద్: స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు కేసు నమోదు చేశారు.  కార్వీపై రెండు కేసులను సీసీఎస్ పోలీసులు పెట్టారు.పలు ప్రైవేట్ బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు పెట్టారు. 

షేర్లను తనఖా పెట్టి తీసుకొన్న అప్పు వాయిదాలు చెల్లించలేదని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. రెండు బ్యాంకుల్లో రూ 460 కోట్లకు పైగా రుణాలు  తీసుకొంది కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ.గత కొన్ని ఏళ్లుగా వాయిదాలు చెల్లించలేదని సంస్థపై  ఫిర్యాదులు అందాయి. హెచ్‌ డీఎఫ్ సీ బ్యాంకు నుండి  రూ. 329 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంకు  నుండి  రూ. 137 కోట్లు తీసుకొంది కార్వీ సంస్థ. అయితే ఈ డబ్బులు చెల్లించలేదు. 2019లో కార్వీ లావాదేవీలపై విచారణ జరిపి నిషేధం విధించింది సెబీ. 

వినియోగదారుల షేర్లను స్వంతానికి  కార్వీ  వాడుకొందనే ఆరోపణలు కూడ ఉన్నాయి.  కార్వీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు  చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios