తెలంగాణ పోలీస్ శాఖ కీలకంగా భావిస్తోన్న హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్ట్ 4న దీనిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం (telangana govt) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ (police command control) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్ట్ 4న దీనిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే భవన నిర్మాణం, టెక్నాలజీ అమర్చడం వంటి పనులు పూర్తయ్యాయి. దీనిని ప్రారంభించే ముందు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ (hyderabad police commissioner) సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

ALso Read:హైద్రాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో కేబుల్ చోరీ: నలుగురు అరెస్ట్

ఇకపోతే.. పోలీస్ కమాండ్ సెంటర్ భవనం ఒక లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని నిర్మాణం వల్ల తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు. ఈ భవన నిర్మాణాన్ని రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత మరో రూ. 200 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ, బీ, సీ, డీ కమాండ్, కంట్రోల్ సెంటర్ టవర్లుంటాయి. ఇక టవర్-ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా టవర్-బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉంటాయి.