Asianet News TeluguAsianet News Telugu

లాఠీలతో కరోనా వైరస్ టెస్ట్: కోర్టుకి తెలిపిన హైదరాబాద్ పోలీసులు

కరోనా వైరస్ ఉందొ లేదో లాఠీతో కొట్టి చూశామని వారు స్వయంగా కోర్టుకి తెలిపారు. ఈ విషయం తెలిసిన తరువాత ఇంత వెచ్చించి కరోనా కిట్లను కొంటున్న ప్రభుత్వాలు, టెస్ట్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న డాక్టర్లు జుట్టుపీక్కోక తప్పదేమో!

Hyderabad Police Claims To Have Hit VehiCles With Lathis To Check For Coronavirus
Author
Hyderabad, First Published Jun 19, 2020, 8:45 AM IST

టైటిల్ చూసి నమ్మకం కుదరడం లేదా. మీరు చదివింది నిజమే. కరోనా వైరస్ ఉందొ లేదో లాఠీతో కొట్టి చూశామని వారు స్వయంగా కోర్టుకి తెలిపారు. ఈ విషయం తెలిసిన తరువాత ఇంత వెచ్చించి కరోనా కిట్లను కొంటున్న ప్రభుత్వాలు, టెస్ట్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న డాక్టర్లు జుట్టుపీక్కోక తప్పదేమో!

లాక్ డౌన్ సమయంలో పోలీసులు మానవ హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారని కోర్టులో షీలా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసారు. పోలీసులు మానవ హక్కులకు భంగం కలిగిస్తూ.... ఇష్ఠానుసారంగా వ్యవహరించారని ఆమె కొన్ని ఉదాహరణలను ఆ పిటిషన్ లో పొందుపరిచారు. 

ఫలక్ నామ పరిధిలో ఒక నివాసిత ప్రాంతంలో రాత్రి పోలీసులు బయట పార్క్ చేసి ఉన్న బండ్లను ధ్వంసం చేసారని పేర్కొన్నారు. దానికి స్పందిస్తూ  ద్విచక్ర వాహనాల్లో కరోనా వైరస్ ఉందొ లేదో టెస్ట్ చేయడానికి ఇలా లాఠీలతో కొట్టి చూశామని కోర్టుకి తెలిపారు. కోర్టు ఒక్కసారిగా షాక్ కు గురైంది. 

కొంతమంది ప్రజలు కూడా తమను పోలీసులు కొట్టారు అని పేర్కొన్నారు. ఖలీమ్ అనే వ్యక్తి తనను పోలీసులు కొట్టారు అని కోర్టుకు తెలిపితే... పోలీసులు మాత్రం అతడిని వెంబడిస్తుండగా మ్యాన్ హోల్ లో పది కాలు విరగ్గొట్టుకున్నాడని, అతడిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించామని కోర్టుకు పోలీసులు కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. కానీ అతడి మెడికల్ రిపోర్టును కూడా సబ్మిట్ చేయలేదని కోర్టు పేర్కొంది. 

పోలీసుల ఆకృత్యాలు ముస్లిమ్స్ మీద అధికంగా జరిగాయని, అమెరికాలోని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ... పోలీస్ ఆకృత్యాలకు వ్యతిరేకంగానే అది జరిగిందని గుర్తుచేసింది కోర్టు. 

ఇకపోతే... తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 352 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. గురువారం వైరస్ కారణంగా ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 195కి చేరుకుంది. రాజధాని హైదరాబాద్‌లోనే 302 మందికి పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

ఆ తర్వాత జనగాం 3, భూపాలపల్లి 2, ఖమ్మం 1, మహబూబ్‌నగర్ 2, మంచిర్యాల 4, మెదక్ 2, మేడ్చల్‌ 10, నల్గొండ 1, నిజామాబాద్ 2, రంగారెడ్డి 17, సంగారెడ్డి 2, వరంగల్ (రూ) 1, వరంగల్ (అ) 3 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 2,531 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 3,301 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, హైద్రాబాద్ సరోజిని ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన వైద్యుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.బుధవారం నాడు నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది 66 మందికి కరోనా సోకింది. 26 మంది వైద్యులు, 40 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. 

Follow Us:
Download App:
  • android
  • ios