Asianet News TeluguAsianet News Telugu

fake loan apps: "ఆ ఫేక్ లోన్ యాప్‌లను తొలగించండి".. గూగుల్‌ను కోరిన‌ హైదరాబాద్ పోలీసులు

fake loan apps: ఆన్‌లైన్ అక్ర‌మ‌ లోన్ యాప్‌ల దారుణాలపై ప‌లు ఫిర్యాదులు రావ‌డంతో సైబ‌ర్ పోలీసు విభాగం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్ర‌మంలో 221 యాప్‌లు చట్టవిరుద్ధమని, ఫేక్ రుణ‌ యాప్‌లని గుర్తించింది. వీటిని ప్లే స్టోర్ నుంచి తొల‌గించాల‌ని పోలీసులు గూగుల్ కు విజ్ఞ‌ప్తి చేశారు.

Hyderabad police ask Google to take down 221 fake loan apps
Author
Hyderabad, First Published Jul 2, 2022, 3:20 AM IST

Fake loan apps:  ఆన్‌లైన్ లోన్ యాప్ ల దారుణాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఈ యాప్స్ వ‌లలో ప‌డి.. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. యాప్ నిర్వాహ‌కుల‌పై  పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారి ఆగడాలు ఆగడం లేదు. ఈ క్ర‌మంలో వీటిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టిసారించారు. గూగుల్ స్టోర్ లో అందుబాటులో ఉన్నా.. అక్ర‌మ ఆన్లైన్ లోన్ యాప్స్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని సెర్చ్ ఇంజిన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కు లేఖ రాశారు. 221 అక్రమ ఆన్‌లైన్ లోన్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని సెర్చ్ ఇంజిన్ మేనేజ్‌మెంట్‌ను హైద‌రాబాద్ పోలీసులు అభ్యర్థించారు.

ఇటీవ‌ల ఆన్‌లైన్ లోన్ యాప్‌ల దారుణాలపై అనేక ఫిర్యాదులు రావ‌డంతో సైబ‌ర్ పోలీసు విభాగం అనేక న‌కిలీ రుణ‌ యాప్‌లను గుర్తించింది, ముఖ్యంగా ప్లే స్టోర్‌లో. అనేక యాప్‌ల వివరణాత్మక ధృవీకరణను అనుసరించి,  221 యాప్‌లు చట్టవిరుద్ధమని; వాటిలో చాలా నకిలీవని తేలిందని పోలీసులు తెలిపారు. సైబ‌ర్ నేర‌గాళ్లు  ఇటువంటి చట్టవిరుద్ధమైన, నకిలీ యాప్‌లను సృష్టించి, వాటిని ప్లే స్టోర్‌లో ఉంచుతున్నారు, సందేహించని వినియోగదారులు.. వాటిని నిజమైనవి అని నమ్మి డౌన్‌లోడ్ చేస్తారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ముందుజాగ్రత్త చర్యగా.. ఈ యాప్‌లను తొలిగించాల‌ని, వాటిని ఎందుకు తీసివేయాలి అనే కారణాలను వివరిస్తూ.. సైబ‌ర్ పోలీసులు రెండు రోజుల క్రితం గూగుల్‌కు లేఖ రాశారు. ఇంతకుముందు కూడా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. కొన్ని చట్టవిరుద్ధమైన, నకిలీ యాప్‌లను మేము గుర్తించామని, వాటిని తీసివేయమని Googleని అభ్యర్థించామని పోలీసులు తెలిపారు. అలాంటి యాప్‌లను గుర్తించడం. వాటిని Google మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకురావడం కొనసాగిస్తామని అధికారి తెలిపారు.

దేశంలో ప్రస్తుతం 600పైగా అక్రమ రుణ యాప్‌లు నడుస్తున్నాయని, రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఆధారంగా  వెల్లడయ్యింది. గతంలో..  వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక రుణ యాప్‌ల పేర్లను రిజర్వ్ బ్యాంక్ వెల్ల‌డించింది. చట్టవిరుద్ధమైన మొబైల్ యాప్‌లకు వ్యతిరేకంగా ఆర్బీఐ కూడా హెచ్చరించింది. ఈ లోన్ యాప్ లో మాయలో పడి..  అప్పులు చేసిన వ్య‌క్తులు .. ఆ యాప్స్ విధించే వ‌డ్డీలు చెల్లించ‌లేక.. దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. 

ఈ  అక్ర‌మ యాప్ రుణాలు ఇస్తున్నప్పుడు వడ్డీ రేటు తక్కువ చెప్పి..  రికవరీ స‌మ‌యంలో చాలా ఎక్కువ వ‌డ్డీ రేటును విధించ‌డం జ‌రుగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇలాంటి  దారుణ‌మైన వార్తలు వస్తున్నాయి. రుణాల రిక‌వ‌రీ విష‌యంలో వినియోగదారుల‌ను వేధింపులకు గురిచేయడం సర్వసాధారణంగా మారింది. దీని కారణంగా కొంతమంది వినియోగదారులు తమ ప్రాణాలను కూడా అర్పించారు. ఇలాంటి కేసుల్లో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీనిపై కూడా  విచారణ జరుపుతున్నారు పోలీసులు.

రిజర్వ్ బ్యాంక్ ఈ విషయంలో  ప‌లు మార్లు ఆదేశాలు జారీ చేసింది,  ఇలాంటి అక్రమ రుణ యాప్‌లపై నిఘా ఉంచాలని, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా బాధ్య‌త‌ ఉందని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios