Asianet News TeluguAsianet News Telugu

అప్పు కట్టినా చిత్రహింసలు , మాజీ హోంగార్డ్ రిజ్వాన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 8 మంది అరెస్ట్

మాజీ హోంగార్డ్ మహ్మద్ రిజ్వాన్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. అతనిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

hyderabad police arrests 8 members gang in mohammad rizwan murder case ksp
Author
First Published Sep 21, 2023, 5:51 PM IST

మాజీ హోంగార్డ్ మహ్మద్ రిజ్వాన్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. అతనిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ సదన్‌ భానునగర్‌కు చెందిన మాజీ హోంగార్డ్ మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అసలు , వడ్డీతో కలిపి దీనిని తీర్చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఓ ముఠా రిజ్వాన్‌ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో వుంచింది. 

రెండు రోజుల పాటు అతనిని చిత్రహింసలకు గురిచేసింది. దీంతో అతని తండ్రి రూ.2 లక్షలు చెల్లించి కొడుకును విడిపించుకున్నాడు. విషయం పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో తండ్రి మౌనం వహించాడు. అయితే దుండగులు కొట్టిన దెబ్బలతో రిజ్వాన్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ రిజ్వాన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రిజ్వాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios