Asianet News TeluguAsianet News Telugu

మెడికల్‌ కాలేజీల్లో సీట్ల పేరుతో మోసం: లక్షలు వసూలు చేసిన ఇద్దరి అరెస్ట్

మెడికల్ కాలేజీ సీట్ల పేరుతో దందా

Hyderabad police arrested two persons for cheating case


హైద్రాబాద్: మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడిన ఇద్దరిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన సంతోష్, మనో‌జ్‌కుమార్‌లు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గురువారం సాయంత్రం హైద్రాబాద్ సీపీ అంజన్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. పీజీ మెడికల్ కళాశాలల్లో సీట్ల పేరుతో మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీకి చెందిన సంతోష్‌, మనోజ్‌కుమార్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన యువతి నుంచి రూ.81 లక్షలు వసూలు చేసినట్టు చెప్పారు. ఢిల్లీలోనూ ఓ వ్యక్తి నుంచి రూ.68 లక్షలు వసూలు చేసినట్లుగా గుర్తించారు. 

ఢిల్లీ, బెంగుళూరు, మైసూర్, బళ్లారితో పాటు దేశ వ్యాప్తంగా పలు  రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని ఈ ముఠా డబ్బులను వసూలు చేసిందని ఆయన చెప్పారు. 

నిందితుల నుంచి నకిలీ స్టాంప్‌లు, ధ్రువపత్రాలు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌కుమార్‌, మనోజ్‌పై కర్ణాటక, ముంబైలో 16కు పైగా కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. పీజీ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్టు  ఆయన చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios