Asianet News TeluguAsianet News Telugu

రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య: త్రిలోక్‌నాథ్ బాబా అరెస్ట్

హైద్రాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు నెల్లూరు బాబా త్రిలోక్‌నాథ్ బాబా (గురూజీ)ని కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కేరళలో తలదాచుకొన్న విజయ్ భాస్కర్ రెడ్డిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad police arrested trilokinath baba for killing realtor vijaybhaskar reddy
Author
Nellore, First Published Aug 12, 2021, 11:28 AM IST

హైదరాబాద్: హైద్రాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య కేసులో  ప్రధాన నిందితుడు నెల్లూరు బాబా త్రిలోక్‌నాథ్ (గురూజీ) ని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో తలదాచుకొన్న త్రిలోక్‌నాథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 త్రిలోక్‌నాథ్ బాబా కోసం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో  బాబా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. త్రిలోక్‌నాథ్ బాబాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన  రియల్‌ఏస్టేల్ వ్యాపారి గడ్డం విజయ్ భాస్కర్ రెడ్డి హైద్రాబాద్ కూకట్‌పల్లిలోని హాస్టల్‌లో ఉంటూ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.గత నెల 20వ తేదీ నుండి ఆయన కన్పించకుండాపోయాడు. ఆయన అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగు చూసింది.

also read:రియల్టర్ విజయ్ భాస్కర్ హత్య కేసులో ట్విస్ట్: బాబాతో పాటు మాజీ ఎమ్మెల్యే పాత్ర?


శ్రీశైలం ప్రాజెక్టుకు సమీపంలోని సున్నిపెంటలో విజయ్ భాస్కర్ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. కావలిలోనే గురూజీ (బాబా)గా ప్రచారం చేసుకొంటున్న వ్యక్తి తన శిష్యుల సహాయంతో విజయ్ భాస్కర్ రెడ్డిని  హత్య చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు.భూముల కొనుగోలు కోసం గురూజీ విజయ్‌భాస్కర్ రెడ్డిని  సంప్రదించాడు. విజయ్ భాస్కర్ చూపిన స్థలాలను కొనుగోలు ఆయనకు కమిషన్ ఇవ్వలేదు.

తాను మోసం చేసిన విజయ్ భాస్కర్ రెడ్డి  గురూజీ అక్రమాలపై ఆరా తీశాడు. ఈ విషయమై  నెల్లూరు. హైద్రాబాద్ పోలీసులకు విజయ్‌భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై తన శిష్యులతో గురూజీ విజయ్ ను బెదిరించాడు. విజయ్ భాస్కర్ రెడ్డిని హత్య చేసిన నలుగురిని  పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్‌పేట భూములను గురూజీ కొట్టేసేందుకు ప్లాన్ చేశారని కూడ పోలీసులు అనుమానిస్తున్నారు.  ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పాత్రపై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios