ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల ఫోటోలతో డబ్బులు వసూలు: రాజస్థాన్ ముఠాను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న  సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad Police Arrested Rajasthan Fraudsters Gang

హైదరాబాద్: IAS, IPS  అధికారులుగా Whats APP  డీపీలో పోటోలు పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను Hyderabad పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.
Rajasthan కేంద్రంగా ఈ ముఠా డబ్బులు వసూళ్లు చేసిందని పోలీసులు గుర్తించారు. Telangana డీజీపీ Mahendera Reddy తో పాటు సీనియర్ ఐపీఎస్,ఐఎఎస్  అధికారుల ఫోటోలు వాట్సాప్ డీపీలు పెట్టుకొని నిందితులు పలువురిని డబ్బులు అడిగారు ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 

ఈ ఏడాది జూన్ 27న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు కొందరుపోలీస్ అధికారులకు డబ్బుల కోసం చాటింగ్ చేశారు. ఈ విసయమై తనకు అందిన సమాచారంతో విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. 

డీజీపీతో పాటు గతంలో కొందరు జిల్లాల  ఎస్పీల పేరుతో కూడా నిందితులు డబ్బుల కోసం వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలో డబ్బులు అడిగారు. తెలంగాణ కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేశారు. మరో వైపు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు గతంలో సోషల్ మీడియాలో డబ్బులు కావాలని అడిగారు. ఈ విషయమై అలెర్టైన కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేశారు. జిల్లాలోని పలువురు వైద్యులు, అధికారులకు సైబర్ చీటర్ మేసేజ్ పెట్టాడు. అయితే కలెక్టర్ మేసేజ్ పంపినట్టుగా భావించిన ఓ డాక్టర్ రూ. 30 వేలు పంపాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్టుగా డాక్టర్ గుర్తించాడు. వెంటనే పోలీసులకు పిర్యాదు చేశాడు.అంతకు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ కు చెందిన ముఠాను అప్పట్లో నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios