హైదరాబాద్:  ఇన్‌స్టంట్ లోన్ యాప్ లపై హైద్రాబాద్ పోలీసుల విచారణలో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.  బెంగుళూరులో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న కీర్తిని సోమవారం నాడు హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగుళూరులోని రుణాల యాప్ కాల్ సెంటర్ లో పనిచేస్తూ పోలీసులకు చిక్కిన ఈశ్వర్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు యాన్ యూ కంపెనీపై దృష్టి పెట్టారు. 

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో చైనాకు చెందిన వాంగ్ జియాన్ షి ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూసిన కీర్తి ధరఖాస్తు చేసుకొంది. జియాన్ షి ఆమెను హెచ్ఆర్ అధిపతిగా నియమించారు.

కాల్ సెంటర్ లోని టెలీకాలర్ల ద్వారా రుణాలు వసూలు చేయాలని వివరించారు. గత ఏడాది జూన్ లో వాంగ్ జియాన్ షి చైనా వెళ్లిపోయాడు. అప్పటి నుండి ఆమె కంపెనీ వ్యవహరాలను చూస్తోంది.

also read:మైక్రోఫైనాన్స్ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్

చైనాకు చెందిన ల్యాంబో నిర్వహిస్తున్న కాల్ సెంటర్లలో పనిచేస్తున్న ఈశ్వర్ కు కీర్తి నిర్వహిస్తున్న కాల్ సెంటర్ కు మధ్య ఆర్ధిక లావాదేవీలున్నట్టుగా గుర్తించామని సీఐ గంగాధర్ చెప్పారు.

ఈ కాల్ సెంటర్ ద్వారా 14 యాప్ ల సహాయంతో కోట్లలో రుణాలు ఇచ్చారని పోలీసులు గుర్తించారు. సోమవారం నాడు కాల్ సెంటర్ ను తెరిచిన కీర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బెంగుళూరు నుండి ఆమెను హైద్రాబాద్ కు తీసుకొచ్చారు.